NIFITY TODAY: పెరిగితే అమ్మండి
టీసీఎస్ ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. స్టాక్ మార్కెట్ ముగిసిన తరవాత ఫలితాలు వస్తాయి. మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించే అంశాల్లో ఇదొకటి. కార్పొరేట్ ఫలితాలే ఇపుడు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. టెక్నికల్‌గా నిఫ్టి సెల్ మోడ్‌లో ఉంది. పెరిగితే అమ్మమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది.కరోనా కారణంగా చైనా మార్కెట్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగితే అమ్మమని టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. మార్కెట్ ఇప్పటికే ఓవర్ బాట్ జోన్లో ఉందని.. ఏ మాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని అంటున్నారు. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ – 17936
రెండో ప్రతిఘటన – 17896
తొలి ప్రతిఘటన – 17869
నిఫ్టికి కీలకం – 17743
తొలి మద్దతు – 17700
రెండో మద్దతు – 17673
డౌన్ బ్రేకౌట్ – 17633