For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15695ని తాకిన నిఫ్టి ఇపుడు 15722 వద్ద ట్రేవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 25 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టికి ఇవాళ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్ల అండ లభిస్తోంది. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి నెక్ట్స్‌ అర శాతం లాభంతో ఉన్నాయి. రిలయన్స్‌ ఇవాళ మరో రూ.18 తగ్గింది. చాలా బ్రోకరేజ్‌ సంస్థలు రిలయన్స్‌కు ఈ స్థాయిలో కొనుగోలు చేయాల్సిందిగా రెకమెండ్‌ చేస్తున్నాయి. మొన్న 17 శాతంపైగా క్షీణించిన ఒఎన్‌జీసీ ఇవాళ మరో నాలుగు శాతం తగ్గింది. మెటల్స్‌ ఇవాళ కూడా ఒత్తిడి కన్పిస్తోంది. ఇనుప ఖనిజం ధరలు భారీగా క్షీణించాయి. దీంతో పలు కంపెనీలు షేర్లు పడ్డాయి. డీమార్ట్‌ 4 శాతం పెరిగింది. ఇండిగో షేర్లు నాలుగు శాతం వరకు తగ్గాయి.