For Money

Business News

స్థిరంగా ప్రారంభం

 

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18153 పాయింట్లను తాకి అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌ 0.24 శాతం లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో కేవలం 14 షేర్లు లాభంలో ఉండగా, 36 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లాభనష్టాల్లో పెద్ద తేడా లేదు. బ్యాంకు షేర్లు ఇవాళ కూడా చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఎల్‌ఐసీ ఇవాళ మరో రెండు శాతంపైగా పెరిగి రూ. 725ని తాకింది. జొమాటొ నుంచి ఉన్నత అధికారి రాజీనామా చేయడంతో ఆ కంపెనీ షేర్‌ రెండు శాతం క్షీణించింది. ఇక మిడ్‌ క్యాప్‌లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, కాకర్డ్‌ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినా… మిగిలిన అన్నీ నిఫ్టి బ్యాంక్‌ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. పీఎన్‌బీ, ఫెడరల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. బ్యాంక్‌ పనితీరు బాగుందని డేటా రావడంతో సౌత్ ఇండియన్‌ బ్యాంక్‌ షేర్‌ ఇవాళ పది శాతం పెరిగి రూ. 21.20ని తాకింది.