For Money

Business News

ఎల్‌ఐసీ టార్గెట్‌ రూ.1000

ఎల్‌ఐసీ షేర్‌ ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. అయితే దిగువ స్థాయిలో ఈ షేర్‌కు క్రమంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా రూ.650 ప్రాంతంలో ఈ షేర్‌కు చాలా గట్టి మద్దతు లభిస్తోంది. నిన్న ఈ షేర్‌ 4 శాతంపైగా పెరిగి రూ. 684 నుంచి రూ. 712కు చేరింది. ఈ షేర్‌ను ఏడాది లక్ష్యంగా కొనుగోలు చేయాల్సిందిగా కొటక్‌ సెక్యూరిటీస్‌ రెకమెండ్‌ చేస్తోంది. మార్జిన్స్‌ క్రమంగా పెరుగుతున్నాయని.. కంపెనీ ఈవీ, అర్నింగ్స్‌ రెండూ పెరుగుతున్నాయని వెల్లడించింది. కంపెనీ వద్ద ఉన్న అనేక షేర్ల విలువ ఇటీవల బాగా పెరిగిందని… ఇది కంపెనీ ఎంటర్‌ప్రైజస్‌ వ్యాల్యూ బాగా పెరుగనుందని తెలిపింది. దీంతో ఈ షేర్‌ రూ. 1000 దాకా పెరగవచ్చని పేర్కొంది.