For Money

Business News

రూ. 55,550 దాటిన బంగారం

బంగారం ఫ్యూచర్స్‌ నిన్న ఇచ్చిన టార్గెట్‌ పూర్తయింది. ఇపుడు పది గ్రాముల బంగారం జనవరి కాంట్రాక్ట్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో రూ. 55,417 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ కాంట్రాక్ట్‌ 423 లాభంతో ట్రేడవుతోంది. అధిక స్థాయిని తాకిన బంగారం మరోసారి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 55,597ని దాటుతుందేమో చూడాలి. బంగారానికి రూ. 55579 వద్ద గట్టి ప్రతిఘటన ఉంది. 55,338ని తాకితే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిజానికి 55358-55388పైన బంగారం ఉన్నంత వరకు ఢోకా లేదు. ఈ స్థాయిలో బంగారం అమ్మాల్సిన పనిలేదు. అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యేలోగా బంగారంలో ఒత్తిడి వస్తుందేమో చూడాలి.