For Money

Business News

ఒబెరాయ్‌ రియాల్టి కాల్‌

గత కొన్ని రోజులుగా ఒబెరాయ్‌ రియాల్టిలో ఓపెన్‌ ఇంటరెస్ట్‌ పెరుగుతోందని… ఈ కంపెనీ కాల్‌ను కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ శుభమ్‌ అగర్వాల్ సూచించారు. సీఎన్‌బీసీ ఆవాజ్‌తో ఆయన మాట్లాడుతూ ఒబెరాయ్‌ రియాల్టి 900 జనవరి కాల్‌ ప్రస్తుతం రూ. 22.50 వద్ద ట్రేడవుతోందని.. రూ.16 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. టార్గెట్‌రూ. 28గా పేర్కొన్నారు. మరో అనలిస్ట్‌ పాల్వియా ఆర్‌ఈసీ ఫ్యూచర్స్‌ను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ షేర్‌ ఇపుడు రూ. 122.65 వద్ద ట్రేడవుతోంది. రూ. 127 లేదా రూ. 129 టార్గెట్‌తో రూ. 120 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.