For Money

Business News

వెండి టార్గెట్ రూ. 71,000

బులియన్‌ మార్కెట్‌లోబంగారం కన్నా వెండి చాలా ఫాస్ట్‌గా కదులుతోంది. దీర్ఘ కాలానికి కూడా బంగారం కన్నా వెండి మంచి ప్రతిఫలాలు ఇస్తుందని అనలిస్టులు అంటున్నారు. సిల్వర్‌ వెండి కిలో ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి కాంట్రాక్ట్‌ ఇవాళ రూ. 70767ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ కాంట్రాక్ట్‌ రూ. 1,230 పెరిగింది. ఇపుడ రూ. 1002 లాభంతో రూ. 70520 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి ప్రతిఘటనలను వెండి దాటేసింది. ఈ స్థాయిలో నిలదొక్కుకుంటే తదుపరి టార్గెట్ రూ. 71018గా అనలిస్టులు పేర్కొంటున్నారు. 70420పైన ఉన్నంత వరకు వెండి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌లో అమ్మకాల ఒత్తిడి పెద్దగా రాకపోవచ్చు.