For Money

Business News

నిఫ్టిలో కొనసాగుతున్న ఒత్తిడి

వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన నిఫ్టటి 16070 స్థాయిని తాకింది. యూరప్ ఫ్యూచర్స్‌ నష్టాల్లో ప్రారంభం కావడంతో నిఫ్టి బలహీనపడటం ప్రారంభమైంది. యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనా… నష్టాలు పరిమితంగా ఉండటంతో నిఫ్టి నష్టాల్లో నుంచి గ్రీన్‌లోకి వచ్చింది. కాని అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలు భారీగా ఉండటం, డాలర్‌ మరింత బలపడతుండటంతో నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. ఇపుడు 40 పాయింట్ల నష్టంతో 15926 వద్ద ట్రేడవుతోంది. ఇతర సూచీలు నిఫ్టి కన్నా అధిక నష్టాలతో ట్రేడవుతున్నాయి. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా చివర్లో షార్ట్‌ కవరింగ్‌ వస్తుందేమో చూడాలి. అనలిస్టులు మాత్రం కాల్ రైటింగ్‌ అధికంగా ఉందని, పుట్‌ రైటింగ్‌ పెద్ద కన్పించడం లేదని అంటున్నారు. మరి నిఫ్టి క్లోజింగ్‌ ఎలా ఉంటుందో చూడాలి మరి.