For Money

Business News

16000 పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15933ని తాకిన నిఫ్టి ఇపుడు 16028 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 207 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 43 షేర్లు లాభాల్లో ఉన్నా… అన్నీ నామమాత్రమే. నిన్న దివీస్‌ ఫార్మా, ఇవాళ సన్‌ ఫార్మా… ఫార్మా కంపెనీల్లో హవా కొనసాగుతోంది. లారస్‌ల్యాబ్‌ కూడా కొన్ని రోజులుగా హాట్‌షేర్‌గా మారింది. ఇక సూచీల విషాయానికొస్తే నిఫ్టితో పాటు ఇతర ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ మాత్రం నామ మాత్రపు లాభాలకు పరిమితమైంది. నిఫ్టి నెక్ట్స్‌లో పీఈఎల్‌, అదానీ గ్రీన్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ షేర్లలో బంధన బ్యాంక్‌ టాప్‌గెయినర్‌గా ఉంది. దివీస్‌ల్యాబ్‌ ఇవాళ కూడా లాభాల్లో ఉంది. మే 26న రూ.3365 ఉన్న దివీస్‌ ల్యాబ్ ఇవాళ రూ.3800 స్థాయిని దాటింది.