For Money

Business News

కీలక స్థాయిలో నిఫ్టి ప్రారంభం

ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 17660 కీలక స్థాయి. సింగపూర్‌ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా తక్కువ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17640ని తాకి ఇపుడు 17652 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 39 పాయింట్ల నేష్టంతో ట్రేడవుతోంది. దాదాపు ఇతర ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. అయితే మిడ్‌ క్యాప్‌ సూచీ చాలా తక్కువ లాభంతో ట్రేడవుతోంది. దాదాపు క్రితం స్థాయి వద్ద ఉంది. మరి నిఫ్టి ఈ స్థాయిలో నిలబడుతుందా లేదా 17600 ప్రాంతానికి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే నిఫ్టికి 17400 ప్రాంతంలో గట్టి మద్దతు ఉందని, ఆ స్థాయి బ్రేక్‌ అయ్యే వరకు నిఫ్టిలో డిప్‌ ఆన్ బై ఫార్ములాను బ్రోకర్లు అమలు చేస్తుంటారని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి మరి దిగువ స్థాయికి చేరుతుందా లేదా అన్నది గమనించండి.