For Money

Business News

17500 ప్రాంతంలో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టితో పోలిస్తే కాస్త మెరుగ్గా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17485ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17541 వద్ద ట్రేడవుతోంది. క్రిత ముగింపుతో పోలిస్తే 217 పాయింట్ల నష్టంతో నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి 42 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిని ఐటీ, బ్యాంక్‌ షేర్లు దిగువకు లాగుతున్నాయి. నిఫ్టి బ్యాంక్‌ ఒక శాతం నష్టంతో ఉంది. కాని నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ గ్రీన్‌లో ఉంది. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ కూడా దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. నిఫ్టి టాప్ లూజర్‌లో హిందాల్కో మూడు శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ షేర్లు రెండు శాతం పైగా నష్టంతో ఉన్నాయి. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ సూచీలో బయోకాన్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, మైండ్‌ ట్రీ, డాబర్‌ షేర్లు రెండు శాతం పైగా నష్టంతో ఉన్నాయి. అశోక్‌ లేల్యాండ్‌ మూడు శాతంపైగా లాభంతో ఉంది. డిక్షన్‌ మళ్ళీ రూ. 4000 ప్రాంతానికి వస్తోంది. దివీస్‌ ల్యాబ్‌ కూడా ఇవాళ నష్టంతో ఉంది. మునుపటిలాగే మళ్ళీ లాభాల్లో క్లోజౌతుందేమో చూడాలి.