For Money

Business News

డే ట్రేడింగ్‌కు పరిమితం అవ్వండి

నిఫ్టిలో ట్రేడ్‌ చేసేవారు… పొజిషనల్‌ ట్రేడింగ్‌కు ఇది సమయం కాదని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ… మార్కెట్‌ ట్రెండ్ ఇంకా స్పష్టం కాలేదని.. అలాంటి సమయంలో పొజిషనల్‌ ట్రేడింగ్‌ కంటే… రోజువారీ ట్రేడింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇవాళ్టి లావాదేవీలను ఇవాళే క్లోజ్‌ చేయాలని.. మరుసటి రోజుకు క్యారీ ఓవర్‌ చేయొద్దని అన్నారు. ఇవాళ కూడా నిఫ్టి పడిన వెంటనే కొనుగోలు చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. గంట వరకు వెయిట్ చేసి… నిఫ్టి నిలదొక్కుకున్న తరవాత కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. నిఫ్టి 17150 పైన ఉన్నంత వరకు నిఫ్టిని అమ్మొద్దని… పడినపుడల్లా కొనుగోలు చేయొచ్చని అన్నారు. అయితే అదే రోజు పొజిషన్‌ను క్లోజ్‌ చేయమని ఆయన సలహా ఇచ్చారు.