17,400పైన నిఫ్టి ప్రారంభం
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17400నిదాటి 17,429ని తాకింది. ఈ స్థాయి దాటితే నిఫ్టి ప్రధాన నిరోధం 17,450. మరి స్థాయిని కూడా నిఫ్టి దాటుతుందా లేదా వెనక్కి తగ్గుతుందా చూడాలి. ఎందుకంటే నిఫ్టి ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 80 పాయింట్ల లాభంతో 17,403 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టిలో పెద్ద కదలికలేదు. మిడ్ క్యాప్ సూచీ పరవాలేదు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 17,450 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. లేదంటే ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే. ఈ స్థాయిలో కొనుగోళ్ళు చేయొద్దని టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు.
నిఫ్టి టాప్ గెయినర్స్
రిలయన్స్ 2,466.65 3.27 ఐషర్ మోటార్స్ 2,851.25 1.74 గ్రాసిం 1,533.50 1.53
బజాజ్ ఆటో 3,801.60 1.17 హిందుస్థాన్ లీవర్ 2,797.05 1.10
నిఫ్టి టాప్ లూజర్స్
టాటా స్టీల్ 1,427.40 -1.13
ఏషియన్ పెయింట్స్ 3,312.05 -0.80
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 686.75 -0.60
ఐఓసీ 112.45 -0.57
పవర్ గ్రిడ్ 174.55 -0.57