For Money

Business News

మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ

అనలిస్టులు ఊహించినట్లుగానే నిఫ్టికి 15700పైన ఒత్తిడి వస్తోంది.ఉదయం ఆరంభంలోనే 15749ని తాకిన నిఫ్టి అక్కడి నుంచి క్షీణిస్తూ వచ్చింది. ఒకదశలో 190 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టి ఇపుడు 121 పాయింట్ల లాభంతో 15678 వద్ద ట్రేడవుతోంది. అన్నింటికన్నా నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ భారీ లాభాల్లో ఉంది. అలాగే నిఫ్టి మిడ్‌ క్యాప్‌. చిత్రంగా ఇవాళ ఐటీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అమెరికా ఫ్యూచర్స్‌ 0.75 శాతం లాభంతో ఉంది. సో… నిఫ్టి గ్రీన్‌లో ఉంది. అయితే కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లో పెద్ద ఉత్సాహం లేదు. ఓపెనింగ్‌లో ప్రధాన సూచీలు నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. ఇతర సూచీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 0.66 శాతం లాభంతో ఉంది. మరి యూరో మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టి 15700పైన ముగిసే అవకాశముంది. అయితే దీనిపై నిలబడుతుందా అనేది చూడాలి. నిలబడితే ఈ ర్యాలీ వచ్చే వారం కూడా కొనసాగుతుందని అనలిస్టలు అంచనా వేస్తున్నారు.