MID SESSION: 17600ని తాకిన నిఫ్టి
మిడ్ సెషన్ తరవాత నిఫ్టిలో తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిప్టి మిడ్ సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,742ని తాకిన అర గంటలోనే భారీగా నష్టపోయింది. దాదాపు 140 పాయింట్లు క్షీణించి 17602ని తాకింది. ప్రస్తుతం 74 పాయింట్ల నష్టంతో 17637 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు ఉదయం ఊహించినట్లు గ్రీన్‌లో ఉన్నాయి. కొన్ని మార్కెట్లు ఒక శాతం దాకా లాభాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ ఒక శాతం దాకా లాభాల్లో ఉండటం వల్ల నిఫ్టి కోలుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇవాళ మంత్లి, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. కాబట్టి 17,700 పైన ముగుస్తుందా లేదా మరో పతనానికి సంకేతం నష్టాల్లో ముగుస్తుందా అనేది చూడాలి. ఇన్వెస్టర్లు మాత్రం నిఫ్టి గరిష్ఠ స్థాయిలకు చేరితే.. అమ్మడం బెటర్. వచ్చేవారం కోసం పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేయమని ప్రముఖ స్టాక్ బ్రోకర్ సుదర్శన్ సుఖాని సలహా ఇస్తున్నారు.