For Money

Business News

17,700 స్థాయిని దాటిన నిఫ్టి

ఎవర్‌గ్రాండే కంపెనీ షేర్‌ను హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సస్పెండ్‌ చేసింది. ఈ కంపెనీ గొడవ ప్రారంభం నుంచి మార్కెట్‌లో ఒకటే ప్రచారం. చైనా మార్కెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ పని అయిపోయిందని.. అక్కడి నుంచి పెట్టుబడులన్నీ భారత్‌కే వచ్చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇవాళ కూడా అదే ప్రచారంతో నిఫ్టిలో భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. హాంగ్‌సెంగ్ రెండున్నర శాతం, జపాన్‌ ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇక మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. కాని మార్కెట్లు మాత్రం ఒక శాతం వరకు లాభం పొందడంతో నిఫ్టి ఒకదశలో 17,750 పాయింట్ల స్థాయిని తాకింది. ఇపుడు 172 పాయింట్ల లాభంతో 17700 వద్ద ట్రేడవుతోంది. చివరిదాకా ఉత్సాహం కొనసాగుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్‌ అరశాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.