For Money

Business News

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ తరవాత కాస్త ఉత్సాహం తగ్గినా… నిఫ్టి 159 పాయింట్ల లాభంతో 17,691 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసినా నిఫ్టి ఆరంభం నుంచే లాభాల్లోకి దూసుకుపోయింది. 17640 ప్రధాన ప్రతిఘటన స్థాయి దాటాక కూడా నిఫ్టి వంద పాయింట్లు పెరిగి 17,750ని తాకింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో ఒక మోస్తరు లాభాలు ఉండటంతో నిఫ్టి స్వల్పంగా క్షీణించింది. ఇపుడు దాదాపు లాభాలన్నీ కోల్పోయి యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. కాని రాత్రికి మార్కెట్లు ప్రారంభమయ్యే సరికి అమెరికా మార్కెట్లు గ్రీన్లో వస్తాయేమో చూడాలి. డాలర్‌ స్వల్పంగా నష్టపోయింది. చాలా రోజుల తరవాత మెటల్స్‌ లాభాల్లోకి వచ్చాయి. అలాగే మిడ్‌ క్యాప్ సూచీ దాదాపు రెండు శాతం పెరగడం విశేషం. బ్యాంక్‌, ఫైనాన్షియల్స్‌ ఒక శాతం దాకా పెరిగితే నిఫ్టి నెక్ట్స్‌ 1.5 శాతం వరకు పెరిగింది. చూస్తుంటే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ పూర్తయ్యే వరకు మార్కెట్‌ బలంగానే కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.