For Money

Business News

15,800 దాటిన నిఫ్టి

నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 15800ని దాటింది. సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ఇక్కడి నుంచి ఎంత వరకు పెరుగుతుందో చూడండి. నిఫ్టి 15744ని తాకిన తరవాత ఇపుడు 14 పాయింట్ల లాభంతో 15792 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం నిఫ్టికి తొలి ప్రధాన నిరోధం 15,820 ప్రాంతంలో ఎదురు కానుంది. ఈ స్థాయికి చేరితే అమ్మండి. స్టాప్‌లాస్‌ 15,835. ఈ స్థాయి దాటితే అమ్మొద్దు. నిన్న ఫలితాలు ప్రకటించిన షేర్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. లాభాల స్వీకరణతో నిఫ్టి క్షీణించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,800 ప్రాంతంలో అమ్మొచ్చు. నిఫ్టికి ఉదయం పేర్కొన్నట్లు 15,770 వద్ద మద్దతు లభించకపోతే 15,730ని చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. యూరో మార్కెట్లు ప్రారంభంలోగా నిఫ్టి నష్టాల్లోకి చేరే అవకాశాలు ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ అరశాతం లాభంతో ఉంది. మిగిలిన సూచీలు డల్‌గా ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో ఎలాంటి బలం లేదు. నిఫ్టిలో లాభాల్లో 23 షేర్లు ఉండగా, 27 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టెక్‌ మహీంద్రా 1,199.30 6.34
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,032.00 2.42
పవర్‌గ్రిడ్‌ 169.45 1.22
టాటా మోటార్స్‌ 296.45 1.21
దివీస్‌ ల్యాబ్‌ 4,895.75 1.07

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఎస్‌బీఐ లైఫ్‌ 1,114.10 -1.31
భారతీ ఎయిర్‌టెల్‌ 561.10 -1.07
బజాజ్ ఫిన్‌ సర్వ్‌ 14,478.35 -0.83
బ్రిటానియా 3,382.00 -0.69
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 986.05 -0.60