For Money

Business News

NIFTY TRADE: పడితే కొంటారా?

ఓపెనింగ్‌ చూస్తుంటే ఇదొక్కటే ఆప్షన్‌గా కన్పిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 15,778. సింగపూర్‌ నిఫ్టి ప్రకారం చూస్తే నిఫ్టి 15700 ప్రాంతంలో ఓపెన్‌ అయ్యే అవకాశముంది. నిఫ్టి నిజంగానే ఈ స్థాయిలో ప్రారంభమైతే…15700 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. లేదంటే పావుగంట వెయిట్‌ చేయొచ్చు. ఎందుకంటే 15,700ని కోల్పోతే నిఫ్టికి 15,655 వరకు ఎక్కడా మద్దతు లేదు. టెక్నికల్‌గా అన్ని సూచీలూ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. నిఫ్టి ఇవాళ 15,650 ప్రాంతానికి వస్తే 15,630 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. నిఫ్టికి 15,700 ప్రాంతంలోనే మద్దతు వస్తుందేమో గమనించండి. దిగువ స్థాయిలో కొనుగోలు చేసినా.. రిస్క్‌ వొద్దనుకునేవారు స్వల్ప లాభాలతో బయటపడండి. ఎందుకంటే 15,735 దాటితేనే నిఫ్టికి మద్దతు లభిస్తుంది. ఈ స్థాయిని దాటితే తొలుత నిఫ్టి 15,770ని తాకే అవకాశముంది.నిఫ్టి గనుక 15800 దాటితే అమ్మడమే.