For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమిమయ్యాయి. అమెరికా జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉన్నా… విశ్లేషకుల అంచనా కన్నా తక్కువే. ఇది నిరాశ కల్గించే అంశమైనా… వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరగవని జీడీపీ తేల్చింది. దీంతో నాస్‌డాక్‌ దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిసింది. ఇతర సూచీలు కూడా అర శాతం కన్నా తక్కువ లాభంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్న చైనా అధికారులు ఇచ్చిన క్లారిటీ ఒక్కరోజు ర్యాలీగా మారింది. ఇవాళ జపాన్‌ నిక్కీ కూడా 1.25 శాతం నష్టంతో ఉంది. ఇక చైనా మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ కూడా దీనికి భిన్నంగా లేదు. సింగపూర్‌ నిఫ్టి 85 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఆగస్టు డెరివేటివ్స్‌ ఇవాళ్టితో ప్రారంభం కానున్నాయి. నిఫ్టి కూడా నష్టాలతో ప్రారంభం కానుంది.