For Money

Business News

నిఫ్టికి ఇవాళ భారీ నష్టాలు?

అంతర్జాతీయ మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్ళీ భయపెడుతున్నాయి. వృద్ధి బాట పట్టిన అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అలసిపోయాయి. భారీ వృద్ధి రేటు కష్టంగా ఉంది. శుక్రవారం యూరో మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ప్రధాన మార్కెట్లు అరశాతంపైగా నష్టపోయాయి. అలాగే అమెరికాలో కూడా అదే ట్రెండ్‌ కన్పించింది. సూచీలన్నీ దాదాపు ఒకశాతం వరకు నష్టపోయాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. కారణాలు స్పష్టంగా లేకున్నా జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు దాదాపు రెండు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ ఏకంగా 2.44 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్ల నష్టాలు ఒక శాతం దాకా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి ఏకంగా 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ స్థాయి నష్టాలతో సింగపూర్ నిఫ్టి ట్రేడ్‌ కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఈ లెక్కన ఈ స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమౌతుందా లేదా కోలుకుని స్వల్ప నష్టాలతో ప్రారంభమౌతుందా అనేది చూడాలి.