For Money

Business News

ప్రారంభమైన చోటే ముగిసిన నిఫ్టి

ఏ హడావుడి లేనిరోజున… నిఫ్టిలో ఆల్గో ట్రేడింగ్‌ చాలా సులువుగా సాగుతోంది. ఇవాళ ఉదయం పేర్కొన్న రేంజ్‌లోనే మార్కెట్‌ కొనసాగడం విశేషం. 15,962 పాయింట్ల గరిష్ఠ, 15882 పాయింట్ల కనిష్ఠ స్థాయిని చూస్తే ఇవాళ ఆల్గే ట్రేడర్స్‌ ఈ ఏస్థాయిలో లాభపడ్డారో మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. ఉదయం ఆరంభంలోనే గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కనిష్ఠ స్థాయిని తాకింది. ఆల్గే ట్రేడర్స్‌ అంచనా వేసినట్లే నిప్టి 15880 ప్రాంతంలో మద్దతు అందడంతో దాదాపు క్రితం ముగింపు వద్దే అంటే 15.923 వద్ద నిఫ్టి ముగిసింది. బ్యాంక్‌నిఫ్టి కూడా అధికస్థాయిల వద్ద ఒత్తిడి ఎదుర్కొంటోంది. మిడ్ క్యాప్‌ సూచీ మాత్రం దాదాపు అర శాతం లాభంతో క్లోజైంది. ప్రత్యేకంగా ఒక రంగానికి అని కాకుండా… ప్రధాన షేర్లకు మద్దతు అందింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 4,766.55 3.46
భారతీ ఎయిర్‌టెల్‌ 540.95 2.95
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 7,320.15 1.82
టాటా స్టీల్‌ 1,274.75 1.50
పవర్‌గ్రిడ్‌ 233.50 1.35

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,006.00 -3.25
ఐషర్‌ మోటార్స్‌ 2,619.10 -1.81
ఇన్ఫోసిస్‌ 1,556.75 -1.52
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 12,766.25 -1.49
అదానీ పోర్ట్స్‌ 689.00 -1.44