ఫెడ్ ఎఫెక్ట్: నిఫ్టి లాభం లాభాలతో…
ఫెడ్ మీటింగ్ పూర్తవడంతో మార్కెట్లో ఒకరకమైన అనిశ్చితి తొలగింంది. మార్కెట్ అంచనాల మేరకే ఫెడ్ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్ వీటిని డిస్కౌంట్ చేయడంతో… ఫెడ్ నిర్ణయం తరవాత వాల్ స్ట్రీట్ భారీ లాభాలతో ముగిసింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒకటిన్నర శాతం లాభ పడగా, హాంగ్‌సెంగ్ అర శాతంపైగా నష్టంతో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ నష్టాల్లో ఉన్నాయి. చైనా నామ మాత్రపు లాభాలతో ఉంది. అమెరికాలో టెక్ షేర్లు భారీ లాభాలతో ముగిసినందున మన మార్కెట్లలో కూడా ఐటీ షేర్లకు మద్దతు లభించే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఈ స్థాయి లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది.