For Money

Business News

NIFTY TODAY: పైన నిలబడుతుందా?

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కానుంది. ఒకవైపు అధిక క్రూడ్‌ ధరలతో పాటు డాలర్‌తో రూపాయి 76ను దాటి మరింత బలహీనమైంది. ఈ నేపథ్యంలో లాభాలు కొనసాగుతాయా అన్న చర్చ మార్కెట్లో ఉంది. రూపాయి బలహీనపడటం… ఐటీ షేర్లకు ప్లస్‌. పైగా నాస్‌డాక్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కౌంటర్లకు ఎంత మాత్రం మద్దతు అందుతుందో చూడాలి. ఇక నిఫ్టి లెవల్స్‌ చూద్దాం. నిఫ్టి క్రితం ముగింపు 17221. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17320ని దాటే పక్షంలో.. నిఫ్టికి మద్దతు కొనసాగుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే 17330ని దాటితే 17,380 వరకు పెద్ద ఒత్తిడి ఉండదు. ఓపెనింగ్‌లోనే భారీ లాభాలతో ప్రారంభమౌతుంది కాబట్టి… నిఫ్టిలో లాభాల స్వీకరణ కోసం ఎదురు చూడటం మంచిది. కాని ఇవాళ డబుల్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉంది. కాబ్టటి భారీ షార్ట్‌ కవరింగ్‌ వస్తే నిఫ్టి మరింత పెరిగే అవకాశముంది. కాబట్టి రిస్క్‌ వొద్దనకునేవారు ఇవాళ మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. రిస్క్‌ తీసుకునేవారు 17,350పైన ఛాన్స్‌ వస్తుందేమో చూడండి. నిఫ్టిని 17380 స్టాప్‌లాస్‌తో అమ్మండి. స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌. స్టాప్‌లాస్‌ దాటితే ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. నిఫ్టి పడితే మాత్రం17,160 వరకు మద్దతు లేదు. నిఫ్టి ఇవాళ కూడా 100 రోజుల చలన సగటు 17260ని కాపాడుకునే అవకాశముంది.