స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో జోష్ తగ్గింది. సూచీలు చాలా జాగ్రత్తగా కదలాడుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా… ట్రెండ్ వీక్‌గా ఉంది. నాస్డాక్ 0.8 శాతం నష్టంతో క్లోజ్ కాగా ఎస్ అండ్ పీ 500 సూచీ 0.11 శాతం నష్టంతో ముగిసింది. డౌజోన్స్ 0.21 శాతం లాభంతో క్లోజైంది. అంతకుముందు యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.9 శాతం. చైనా A50 సూచీ 0.88 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ నామ మాత్రపు నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి పది పాయింట్ల లాభంతో ఉన్నా… ఓపెనింగ్ సమయానికి ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. మొత్తానికి నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.