For Money

Business News

NIFTY TRADE: 18,150 కీలకం

రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నిఫ్టిని కాపాడుతాయా అన్నది చూడాలి. అంతర్జాతీయంగా మన మార్కెట్లకు అనుకూల అంశాలు ఏవీ లేదు. కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ నుంచి మద్దతు అందుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఫలితాలపై మార్కెట్‌ భిన్నంగా స్పందిస్తోంది. ఆయిల్, రీటైల్‌ బిజినెస్‌ బాగా ఉన్నా… టెలికాం విభాగం పనితీరు నిరుత్సాహకరంగా ఉంది. కస్టమర్ల సంఖ్య బాగా తగ్గుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో బ్యాంక్‌నిఫ్టికి ఊతం లభించవచ్చు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే.. నిఫ్టికి ఇవాళ 18,150 కీలకం. నిఫ్టి క్రితం ముగింపు 18,114. ఫలితాలు నిఫ్టి ఈ స్థాయికి తెస్తే కాస్సేపు ఆగండి. ఎందుకంటే 18,150ని క్రాస్‌ చేస్తే నిఫ్టి 18200ని దాటే అవకాశముంది. ఈ స్థాయిలో 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మండి. రిస్క్‌ తీసుకునేవారు అంతకన్నా ముందే నిఫ్టిని షార్ట్‌ చేయొచ్చు. నిఫ్టికి పై స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వస్తే… వెంటనే నిన్నటి ముగింపు 18120-18105 ప్రాంతానికి రావొచ్చు. ఈ స్థాయికి వస్తే కాస్సేపు ఆగండి. ఎందుకంటే టెక్నికల్‌గా నిఫ్టికి ఇక్కడ మద్దతు అందాలి. అందని పక్షంలో 17,990ని తాకొచ్చు. ఇక్కడ గనుక మద్దతు అందకపోతే 17,940 ప్రాంతానికి చేరే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్‌ నుంచి స్పష్టమైన సంకేతాలు లేనందున…నిఫ్టిపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. కాబట్టి నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించండి. పతనం భారీగా ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే నిఫ్టి ఓవర్‌బాట్ పొజిషన్‌ నుంచి బయటపడుతోంది.