స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. గత శుక్రవాం జాబ్ డేటా నిరాశాజనకంగా ఉండటంతో అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద తేడా లేదు. అంతకుముందు యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. చాలా రోజుల తరవాత చైనా, హాంగ్‌సెంగ్ ఆకర్షణీయ లాభాల్లో ట్రేడవుతున్నాయి. చైనా కీలక సూచీలు ఒక శాతంపైగా లాభపడటం విశేషం. ఇక జపాన్ నిఫ్టి అన్నికంటే అధికంగా 1.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఒకట్రెండు మార్కెట్లు తప్ప అన్నీ.. గ్రీన్‌లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 30 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభం కానుంది.