For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.7 2 శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.36 శాతం.. డౌజోన్స్‌ 0.2 శాతం నష్టంతో ముగిశాయి. అంతకుముందు యూరో మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ప్రారంభ లాభాలు చాలా వరకు తగ్గి స్వల్ప లాభాలతో ముగిశాయి. వాల్‌స్ట్రీట్‌కు అనుగుణంగా ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాలతో ట్రేడవుతున్నాయి. తైవాన్‌ సూచీ ఒక్కటే ఒక శాతంపైగా నష్టంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ 0.68 శాతం నష్టంతో ఉండగా, జపాన్‌ నిక్కీ స్వల్ప నష్టంతో ఉంది. చైనా నష్టాలన్నీ అర శాతంలోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 62 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి 15800 దిగువన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.