భారీ లాభాలతో ప్రారంభం
నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటంతో మార్కెట్‌లో జోష్ నెలకొంది.
పుతిన్ భారత్ పర్యటన తర్వాత ఇద్దరి నేతల మధ్య వీరి సంభాషణ జరగ్గా.. వీరి మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భారత్‌పై సుంకాలు విధించిన తరవాత ఇద్దరినేతల మధ్య ఫోన్ కాల్‌ఉ జరగడం ఇది మూడోసారి. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ చర్చ జరిగినట్లు పీఎం ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో వాణిజ్య ఒప్పందంపై ఆశలు పెరిగాయి. ప్రస్తుతం 125 పాయింట్ల లాభంతో గిఫ్ట్ నిఫ్టి ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టి 26,000 స్థాయిని దాటే ఛాన్స్ ఉంది. గత కొన్ని రోజులుగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకు మద్దతు లభించే ఛాన్స్ ఉంది. అయితే భారత వస్తువులపై 35 శాతం నుంచి 50 శాతం సుంకాలను మెక్సికో విధించింది. దీంతో ఆటో రంగ షేర్లపై ప్రభావం ఉండే అవకాశముంది. ఏటా 200 కోట్ల డాలర్ల ఆటోమొబైల్స్‌ను భారత కంపెనీలు మెక్సికోకు ఎగుమతి చేస్తున్నాయి.
