For Money

Business News

నిఫ్టికి ఇవాళ కూడా పండుగే?

రాత్రి అమెరికా మార్కెట్లు దుమ్ము రేపాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్ళు జరిగాయి. గత కొన్ని వారాలుగా నాస్‌డాక్‌ డల్‌గా ఉంది.చాలా షేర్లు 10 శాతం నుంచి 25 శాతం దాకా తగ్గాయి. దీంతో దిగువస్థాయిలో మద్దతు అందింది. నాస్‌డాక్‌ 3 శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 2 శాతం, డౌజోన్స్‌ 1.4 శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్‌ ఒమైక్రాన్‌ భయాలను పట్టించుకోవడం మానేసింది. కాని ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ఆ ఉత్సాహం కన్పించడం లేదు. ఒక్క జపాన్‌ నిక్కీ, న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియాలలో మాత్రం సూచీలు ఒక శాతంపైగా లాభాలు పొందాయి. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా లాభాలు మాత్రం ఒక శాతం లోపే ఉన్నాయి. కీలకమైన హాంగ్‌సెంగ్‌ లాభాలు కేవలం 0.33 శాతం మాత్రమే. సింగపూర్‌ నిఫ్టి 125 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కావొచ్చు.