లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్ల మూడ్ పాజిటివ్‌గా ఉంది. భారీ నష్టాల తరవాత శుక్రవారం యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. అలాగే అమెరికా మార్కెట్లు కూడా. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. నాస్ ఒక శాతం లాభంతో క్లోజైంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా అదే స్థాయి లాభాలతో ట్రేడవుతున్నాయి. గతవారం భారీగా క్షీణించిన జపాన్ నిక్కీ ఇవాళ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.చైనా మార్కెట్లు కూడా ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ మాత్రం అర శాతం లాభాలకే పరిమితమౌతోంది. సింగపూర్ నిఫ్టి 60 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి 15750 ప్రాంతంలో ఓపెన్ కానుంది. డాలర్‌తో పాటు క్రూడ్ కూడా గ్రీన్‌లో ఉంది. బ్రెంట్ క్రూడ్ 75.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.