For Money

Business News

NIFTY TRADE: కొనే ఛాన్స్‌ రాకపోవచ్చు

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. కీలక మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రం అరశాతం లాభంతో ఉంది. అలాగే సింగపూర్‌ నిఫ్టి కూడా. ఇదే లెక్కన చూస్తే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,750ని దాటే అవకాశాలు ఉన్నాయి. 15,760ని దాటితే నిఫ్టి 15,800కి చేరుతుందేమో చూడాలి. ఈ స్థాయికి వస్తే నిఫ్టి అమ్మడం కష్టమే. కాని 15,750పైన వీక్‌గా కన్పిస్తే అమ్మొచ్చు. 15,730కి చేరితే ఆగండి. ఇక్కడా కూడా బలహీనంగా ఉంటే నిఫ్టి 15,690ని తాకడం ఖాయం. అంటే అధిక స్థాయిలో అమ్మితే స్వల్ప లాభాలతో బయటపడటం మంచిది. 15,650 వద్ద నిఫ్టికి మద్దతు ఉంది. కొనుగోలు సిగ్నల్‌ ఇక్కడే ఉంది. మరి నిఫ్టి ఈ స్థాయికి వస్తుందా అన్నది చూడాలి. పడితే కూడా కేవలం టెక్నికల్‌గా పడి…వెంటనే కోలుకునే అవకాశముంది. ఇవాళ కొనుగోలుస్థాయికి నిఫ్టి రాకపోవచ్చు. మిగిలింది ఒకటే మార్గం. అధికస్థాయిలో అమ్మి స్వల్ప లాభంతో బయటపడటం. అమ్మినా… స్వల్ప స్టాప్‌లాస్‌ ఉంచుకుని ట్రేడ్‌ చేయండి. 15,750- 15,790 మధ్య 15,805 స్టాప్‌లాస్‌తో అమ్మి.. స్వల్ప లాభంతో బయటపడండి. లేదంటే ఇవాళ నో ట్రేడ్‌. ఈ టెక్నికల్‌ స్థాయిలు పూర్తిగా డే ట్రేడర్స్‌ కోసం. పొజిషనల్‌ ట్రేడింగ్‌కు కాదు.