For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

మార్టిన్ లూథర్‌ కింగ్‌ జయంతి సందర్భంగా రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి మెజారిటీ ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఇవాళ భేటీ కానుంది. వడ్డీ రేట్లలో మార్పులు ఉండవన్న వార్తలతో నిక్కీ 0.8 శాతం లాభంతో ఉంది. ఇక హాంగ్‌సెంగ్‌ 0.44 శాతం లాభంతో ఉంది. గడచిన రెండేళ్ళలో తొలిసారి చైనా వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో చైనా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా ఉంది. 25 పాయింట్ల నష్టంలో ఉన్నా… మన మార్కెట్ల ప్రారంభ సమయానికి గ్రీన్‌లోకి వచ్చే అవకాశముంది. సో…నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.