For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ దాదాపు ఎలాంటి మార్పు లేకుండా ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా మైక్రోసాఫ్ట్‌ రికార్డు స్థాయి లాభాలు. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ అర శాతం క్లోజ్‌ కాగా, డౌజోన్స్‌ 0.7 శాతం నష్టంతో ముగిసింది. అంతక్రితం యూరో మార్కెట్లు కూడా నష్టాలోముగిశాయి. ప్రధాన మార్కెట్లలో నష్టాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి కాస్త తక్కువ నష్టాలైతే… అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉండటం విశేషం. జపాన్‌ నిక్కీ నుంచి హాంగ్‌సెంగ్‌ వరకు అన్నీ నష్టాలే. చైనా మార్కెట్ కూడా అదే దారిలో ఉంది. సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా గ్రీన్‌లోప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.