For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు దశ, దిశ లేకుండా సాగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక మోస్తరు లాభాలతో క్లోజ్‌ కాగా, నాస్‌డాక్‌, డౌజోన్స్‌ నామ మాత్రపు లాభాల్లో ముగిశాయి. క్రూడ్‌ భారీగా పెరడగడంతో ఎనర్జీ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికాలో నిరుద్యోగ భృతి దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో క్రూడ్‌ ధరలు పెరిగాయి. డాలర్‌ కూడా పటిష్ఠంగా ఉంది. ఇవాళ అమెరికా జాబ్స్‌ డేటా కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ స్వల్ప లాభాలతో ట్రేడవుతుండగా, చైనా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. పీఎంఐ నిరాశజనకంగా ఉండటంతో చైనా50 Aసూచీ రెండున్నర శాతం నష్టంతోంది. నిన్న సెలవు తరవాత ఇవాళ ప్రారంభమైన హాంగ్‌సెంగ్‌ 1.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.కొన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా…అవి నామమాత్రమే. సింగపూర్‌ నిఫ్టి 25 పాయింట్ల లాభంతో ఉంది. కాని నిఫ్టి స్థిరంగా లేదా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి.