For Money

Business News

NIFTY TRADE: దిగువనైనా కొనొచ్చా…

ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నిఫ్టి భారీగా పడకపోయినా.. బలహీనంగా కన్పిస్తోంది. ఏమాత్రం పెరిగినా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రోత్సాహం లేదు. ఇక డాలర్‌, క్రూడ్‌ పరోక్షంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి పడితే ఎంత వరకు? అనే ప్రశ్న వేధిస్తోంది. చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు మాత్రం… లాంగ్‌ టర్మ్‌ దృష్ట్యా నిఫ్టిని కొనమనే చెబుతున్నారు. అయితే కాస్త ఆగమంటున్నారు. కాని డే ట్రేడర్స్‌కు ఇపుడు డబుల్‌ ప్రాఫిట్‌ వస్తోంది. ఆల్గో ట్రేడింగ్‌ ఫాలో అయ్యే ట్రేడర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇక ఇవాళ్టి విషయానికొస్తే నిఫ్టి పెరిగితే ఇవాళ కూడా ఒత్తిడి రావడం ఖాయంగా కన్పిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 15,680. ఓపెనింగ్‌లో నిఫ్టి 15700ని దాటే అవకాశముంది. మార్కెట్‌ ఇది చాలా కీలక స్థాయి. ఇక్కడి నుంచి పెరిగితే 15,730 ప్రాంతంలోనే అమ్మకాల ఒత్తిడి వస్తుంది. కాబట్టి 15744 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. ఆసియా మార్కెట్ల నష్టాలను చూస్తుంటే నిఫ్టి 15720 లేదా 15730ని తాకడం కూడా కష్టంగా కన్పిస్తోంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఇదే స్థాయిలో నిఫ్టిని అమ్మొచ్చు. నిఫ్టి గనుక 15700 దిగువక వస్తే వెంటనే లాభాలు స్వీకరించకండి. 15,655 స్థాయికి వస్తే వెయిట్‌ చేయండి. ఇక్కడ నిఫ్టి బలహీనంగా ఉన్నా లేదా ఈస్థాయికన్నా పడితే.. నిఫ్టి చాలా సులభంగా 15630-15620ని తాకే అవకాశాలే అధికంగా ఉన్నాయి. టెక్నికల్‌గా నిఫ్టి సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నా… నిఫ్టి ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ఉంది. అయితే కొనుగోళ్ళ ఆసక్తి ఇప్పట్లో వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఇంకా దిగువన రావొచ్చు. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వీరి అమ్మకాల వల్ల మార్కెట్‌కు పెద్ద నష్టం లేకపోయినా.. సెంటిమెంట్‌ మాత్రం దెబ్బతింటోంది. సో…15620-15630 ప్రాంతానికి వస్తే 15,610 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి.ఈ స్థాయి దిగువకు నిఫ్టి వస్తే తదుపరి స్థాయి 15,570.