నిఫ్టిని రిలయన్స్ కాపాడగలదా?
ఇవాళ నిఫ్టిపై టీసీఎస్, రిలయన్స్‌ల ప్రభావం అధికంగా ఉండే అవకాశముంది. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులతో రిలయన్స్ పాజిటివ్ జోన్‌లో, ఫలితాలతో టీసీఎస్ నెగిటివ్ జోన్‌లో ఉన్నాయి. అయితే నిఫ్టిని కాపాడే సత్తా రిలయన్స్‌లో ఉందా అన్నది చూడాలి. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్స్ కంటే ఇండెక్స్ ఆప్షన్స్‌లోనే అధికంగా ట్రేడ్ చేస్తున్నారు. అలాగే స్టాక్ ఫ్యూచర్స్‌లో అమ్మాకాలు చేస్తున్నారు. నిఫ్టికి 17949-17980 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని విశ్లేషకులు అంటున్నారు. పూర్తి నిఫ్టి వ్యూహం కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=AjEitLRKYjc