For Money

Business News

హెటిరో దొంగ లెక్కలు దొరికాయి

ఈనెల 6వ తేదీ నుంచి ఈ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నామని, కంపెనీ SAP @ERP సాఫ్ట్‌వేర్‌ నుంచి రహస్య డిజిటల్‌ సాక్ష్యాలను పొందినట్లు ఐటీ విభాగం వెల్లడించింది. సోదాల్లో కొన్ని రహస్య ప్రాంతాలను కనుగొన్నామని, అకౌంట్స్‌లో సెకండ్‌ సెట్స్‌ బుక్స్‌ నిర్వహిస్తున్నట్లు తేలిందని ఐటీ విభాగం వెల్లడించింది. రహస్య డిజిటల్‌ మీడియా, పెన్‌ డ్రైవ్‌, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. బోగస్‌ సంస్థల నుంచి , అస్సలేని సంస్థల నుంచి కొనుగోళ్ళు చేసినట్లు పుస్తకాల్లో చూపించినట్లు గుర్తించారు. అలాగే కొన్ని హెడ్స్‌ కింద అధిక వ్యయం చూపించారి…వీటిని తొలగించిన విషయం కూడా తమ సోదాల్లో బయటపడినట్లు ఐటీ విభాగం వెల్లడించింది. భూములకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు కూడా బయటపడింది.వ్యక్తిగత ఖర్చులను కూడా కంపెనీ ఖర్చుల కింద చూపినట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు. సన్నిహిత కంపెనీల నుంచి ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువ కన్నా తక్కవ విలువకు భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇంకా దర్యాప్తు సాగుతోందని, అక్రమ ఆదాయం ఎంత ఉందో ఇంకా లెక్కలు వేస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు.