For Money

Business News

సోమవారం ట్రేడింగ్‌ కోసం

గతవారం నిఫ్టి 50 రోజుల చలన సగటు అయిన 17460కి 230 పాయింట్లు దిగువన క్లోజైంది. ఈ గ్యాప్‌ ఏరియా సోమవారం చాలా కీలకంగా మారనుందని, ఒకవేళ కరెక్షన్‌ కొనసాగే పక్షంలో నిఫ్టి 17170 లేదా 1700కి చేరవచ్చని ఎస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఆదిత్ అగర్వాల్‌ అన్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం ఆయన నిఫ్టి కదలికలతో పాటు రెండు షేర్లను సిఫారసు చేశారు. 50 రోజుల చలన సగటు అయిన 17460పై నిఫ్టి నిలదొక్కుకుంటే షార్ట్‌ కవరింగ్‌ వచ్చి…నిఫ్టి 1766 లేదా 17670ని తాకుందని ఆయన అన్నారు. పెరిగితే 17800 పడితే 17000వైపు నిఫ్టి పయనిస్తుంద్నారు. ఇక సోమవారం నాటికి ఆయన సిఫారసు చేసిన రెండు షేర్లు ఇవి.
1. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌. ఈ షేర్‌ను రూ. 645 స్టాప్‌లాస్‌తో రూ.710 లక్ష్యం కోసం కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 671 వద్ద ఉంది.
2. హావెల్స్‌ షేర్‌ను అమ్మాల్సిందిగా ఆదిత్య సలహా ఇస్తున్నారు. ఈ షేర్‌ ఇపుడు రూ. 1175 వద్ద ఉంది. రూ. 1110 లక్ష్యం కోసం రూ. 1210 స్టాప్‌లాస్‌తో అమ్మాలని ఆయన సలహా ఇస్తున్నారు.