భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 365 పాయింట్ల పాయింట్ల నష్టంతో 15879 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ కూడా 1161 పాయింట్లు నష్టపోయింది. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ సూచీ కూడా 151పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి మూడు శాతంపైగా నష్టపోయాయి. భారీగా నష్టపోయిన షేర్లలో ఆటో షేర్లు ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మూడు శాతం పైగా నష్టంతో ఉన్నాయి. మరి నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలుకుంటుందా లేదా ఆసియా మార్కెట్ల స్థాయిలో నష్టపోతుందా అన్నది చూడాలి. గత శుక్రవారం యూరో మార్కెట్లు నాలుగు శాతంపైగా నష్టపోయాయి. మరి ఇవాళ ప్రారంభమౌతాయో కూడా చూడాలి. మిడ్ సెషన్ ట్రేడింగ్ మరోసారి కీలకం కానుంది.