For Money

Business News

లాభాలు స్వీకరించండి

నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుందని, ఇప్పటికే షార్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించమని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని సలహా ఇస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ 18 ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ… పలు మార్లు నిఫ్టిని షార్ట్‌ చేయమని సలహా ఇచ్చారు. ఇవాళ ఆకర్షణీయ లాభాలు వస్తున్నందున… లాభాలు స్వీకరించమని అంటున్నారు. ఈ దశలో నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని అంటున్నారు. వరుస లాభాలు, వరుస నష్టాలు ఉండవని అంటున్నారు. అయితే బ్యాంక్‌ నిఫ్టిని మాత్రం షార్ట్‌ చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు.