For Money

Business News

లాభాల్లో ప్రారంభం కానున్న నిఫ్టి

వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాల్లో ముగిసింది. నిన్న కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ అర శాతంపైగా క్షీణించింది. డాలర్స్ ఇండెక్స్‌ 97ని దాటుతుందని అనలిస్టులు భావిస్తున్న నేపథ్యంలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో 96కి దిగువకు పడటానికి సిద్ధంగా ఉంది.దీంతో ఈక్విటీ మార్కెట్‌లో కొనుగోళ్ళు పెరిగాయి. ఆరంభంలో చాలా డల్‌గా ఉన్న సూచీలు క్లోజింగ్‌ సమయానికల్లా ఒక శాతంపైగా లాభపడ్డాయి. కాని ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి. ఏ సూచీ కూడా అరశాతం లాభాలను దాటలేదు. అయితే అమెరికా మార్కెట్లను ట్రాక్‌ చేస్తున్న సింగపూర్ నిఫ్టి అర శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో17000 స్థాయిని దాటే అవకాశాలు ఉన్నాయి.