For Money

Business News

17,900 చేరువలో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే దాదాపు వంద పాయింట్లు పెరిగి 17,892ని తాకింది. ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 17,877 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 43 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే మిడ్‌ క్యాప్‌ షేర్లు డల్‌గా ఉన్నాయి. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ కూడా 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ కూడా ఇదే స్థాయి లాభాలతో ఉంది. ఇవాళ కూడా పలు రంగాల షేర్లు వెలుగులో ఉన్నాయి. ఫలానా రంగం అంటూ ఏదీ లేదు. ఆర్‌బీఐ పరపతి విధానం కోసం వెయిట్‌ చేయండి. సాదాసీదాగా ఉంటే నిఫ్టిని 17,920 స్టాప్‌లాస్‌తో షార్ట్‌ చేయొచ్చు. లేదా ఇవాళ్టికి నో ట్రేడ్‌.