For Money

Business News

కోలుకున్నా నష్టాల్లో నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌ ఆయిల్ షాక్‌ నుంచి తేరుకుంది. ముడి చమురు కంపెనీల ఆయాచిత ఆదాయంపై కేంద్రం పన్ను వేయడంతో రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, వేదాంత వంటి సేర్లు భారీగా నష్టపోవడంతో నిఫ్టి ఒకదశలో 15511 పాయింట్లకు క్షీణించింది. అంటే దాదాపు 270 పాయింట్లు క్షీణించింది. అయితే దిగువ స్థాయి నుంచి కోలుకున్న నిఫ్టి ఇపుడు 15680 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ బజాజ్‌ ట్విన్స్‌ మూడు శాతంపైగా లాభపడి నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో నిలిచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఏషియన్‌ పెయింట్స్‌ పెరిగింది. ఎప్పటిలాగే ఐటీసీ మార్కెట్‌కు అండగా నిలిచింది. అయితే నిఫ్టిని ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ దారుణంగా దెబ్బకొట్టాయి. మార్చి రూ. 194 ఓఎన్జీసీ షేర్‌ ఇవాళ రూ. 131.55కు క్షీణించింది. ఇవాళ ఒక్క రోజే షేర్‌ 15 శాతం క్షీణించింది. అలాగే రిలయన్స్‌ కూడా ఆరు శాతం నష్టంతో రూ. 2443 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు యూరో మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే చాలా వరకు నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చాయి. అమెరికా ఫ్యూచర్స్‌ మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి.