అదే స్థాయి నుంచి కోలుకున్న నిఫ్టి
నిన్న 16968ని తాకిన నిఫ్టి ఇవాళ 16942ను తాకిన తరవాత కోలుకుంది. ఉదయం ఆకర్షణీయ లాభాలు ఆర్జించిన నిఫ్టి మిడ్ సెషన్లోపే నష్టాల్లోకి జారకుంది. 17176 నుంచి 16942కు క్షీణించింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంది. అమెరికా ఫ్యూచర్స్ ఒకటిన్నర శాతం లాభంతో ఉండగా, మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా ఒకటిన్నర శాతం లాభంతో ఉన్నాయి. దీంతో నిఫ్టి 17072కి చేరి స్థిరంగా ట్రేడవుతోంది. 56 పాయింట్ల లాభంతో ఉన్న నిఫ్టి క్లోజింగ్కల్లా మరింత పుంజుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్లో ఉన్నా… ఈవారంలో వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ ఉన్నందున నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. మెటల్స్, ఆటో రంగాల్లో ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్ లాభాల్లో ఉన్నా బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు ఇంకా నష్టాల్లో ఉన్నాయి.