For Money

Business News

కోలుకున్న నిఫ్టి… నష్టాల్లోనే షేర్లు

రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ అనూహ్యంగా కోలుకుంది. ఓపెనింగ్‌లో 15687ని తాకిన నిఫ్టి అక్కడి నుంచి దాదాపు 150 పాయింట్లకుపైగా కోలుకుని 15840ని తాకింది. ఇపుడు 28 పాయింట్ల నష్టంతో 15821 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇదంతా కేవలం సూచీ ఆధారంగా చేసిన కాంట్రాక్ట్‌లను కాపాడుకునే ప్రయత్నంగా కన్పిస్తోంది. ఎందుకంటే నిఫ్టి పెరిగినా షేర్ల ధరలు పెరగలేదు. నిఫ్టి షేర్లు మినహా మిగిలిన అన్ని సూచీలు భారీ నష్టాల్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. నిఫ్టి మిడ్‌క్యాప్‌, నిఫ్టి బ్యాంక్‌ సూచీలు ఇంకా ఒక శాతం వరకు నష్టాల్లో ఉండటమే దీనికి కారణం. కేవలం నిఫ్టి ఆధారంగా జరిగిన ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ కాపాడటం కోసం నిఫ్టిని పెంచారని… మార్కెట్‌ మాత్రం బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. జర్మనీ డాక్స్‌ ఏకంగా 1.27 శాతంతో ట్రేడవుతోంది. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.87 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి మాత్రమే పెరిగి.. షేర్లు పడుతాయా… లేదా షేర్లతో పాటు నిఫ్టి పడుతుందా అన్నది చూడాలి.