For Money

Business News

16,600పైన నిఫ్టి

ఇవాళ రాత్రికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. నిన్న రాత్రి భారీగా క్షీణించిన అమెరికా ఫ్యూచర్స్‌ ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.6 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్‌లో నిఫ్టికి మద్దతు అందింది. ఉదయం నష్టాల్లోకి జారుకుని 16438 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16602 పాయింట్ల వద్ద 118 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం నష్టాల్లో ఉన్న దివీస్‌ ల్యాబ్‌ అనూహ్యంగా లాభాల్లోకి వచ్చింది. 3 శాతం లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అలాగే చక్కటి ఫలితాలు ప్రకటించిన ఎల్‌ అండ్‌ టీ కూడా 1798 వద్ద ట్రేడవుతోంది. జొమాటొ షేర్‌ ఇవాళ రూ. 44.40కి పెరిగినా.. అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో ఇపుడు రూ. 43 వద్ద ట్రేడవుతోంది.