For Money

Business News

జొమాటొ…ఇపుడు కొనొచ్చా?

జొమాటో షేర్‌లో ఇవాళ పతనం ఆగింది. షేర్‌ ఐపీఓ పూర్తయిన సందర్భంగా… ఐపీఓకు ముందు ఈ షేర్లను కొనుగోలు చేసిన యాంకర్‌ ఇన్వెస్టర్లపై లాక్‌ ఇన్‌ పీరియడ్‌ అయిపోయింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్‌ను అమ్మేశారు. నిన్న కూడా మూరే స్ట్రాటెజిక్‌ సంస్థ ఏకంగా 4.25 కోట్ల షేర్లను రూ.44 వద్ద అమ్మేసింది. నిన్న ఒకదశలో ఈ షేర్‌ పది శాతం క్షీణించింది. చివరల్లో రూ. 41.65 వద్ద ముగిసింది. ఈ స్థాయిలో అనేక బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ను కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తున్నాయి. నిన్న జెఫరీస్‌ సంస్థ రూ. 90 టార్గెట్‌గా పెట్టింది. అలాగే ఇవాళ క్రెడిట్‌ సూసే కూడా ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా సిఫారసు చేసింది. అయితే ఈ కంపెనీలో వాటా ఉన్న ఊబర్‌ ఏం చేస్తుందో చూడాలని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ కంపెనీలో ఊబర్‌కు 8 శాతం వాటా ఉంది. ఈ మధ్య కాలంలో డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ప్రస్తుత ధర వద్ద ఊబెర్‌కు నష్టాలు వస్తున్నాయని.. అయినా ఈ స్థాయిలోనే అమ్మేందుకు ఊబర్‌ సిద్ధమౌతుంది లేదా ఆగుతుందా అన్నది చూడాలి. ఇక నిన్నటి నుంచి పలు బ్రోకింగ్‌ సంస్థల రెకమెండేషన్స్‌ షేర్‌పై పాజిటివ్‌ ప్రభావం చూపుతోంది. ప్రస్తతుం ఈ షేర్‌ రూ. 1.35 లాభంతో రూ. 43 వద్ద ట్రేడవుతోంది. ఈ లాభాలను నిలబెట్టుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే యాంకర్‌ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో షేర్లను అమ్ముతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోవడం మార్కెట్‌కు కష్టమే.