MID SESSION: నష్టాల నుంచి కోలుకుని
ఆరంభంలో ఆకర్షణీయ లాభాలు గడించిన నిఫ్టికి అర గంటలోనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 10.45 ప్రాంతంలో 17,593 ప్రాంతంలోనే నిఫ్టికి మద్దతు లభించింది. అక్కడి నుంచి నిఫ్టి క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధాన కారణంగా యూరో ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటం. బ్యాంక్ నిఫ్టి మినహా మిగిలిన సూచీల నుంచి పెద్దగా అండలేదు. ఇవాళ పీఎస్‌యూ షేర్ల హవా నడుస్తోంది. దీంతో మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఉన్నా నిఫ్టి అరశాతంపైగా లాభంతో ఉంది. నిజానికి నిఫ్టి నెక్ట్స్ 0.3 శాతం నష్టాల్లో ఉంది. కాబట్టి క్లోజింగ్‌లో ఎలా ముగుస్తుందో చూడాలి. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్‌లో పెద్దగా బలం లేదు. యూరో మార్కెట్లు కూడా స్వల్ప లాభాలతో ఉన్నాయి. యూరో స్టాక్స్ 50 కేవలం 0.3 శాతం లాభంతో ఉంది. యూరో ఏమాత్రం నీరసించినా చివర్లో ఒత్తిడి రావొచ్చు.