For Money

Business News

నిఫ్టి: 350 పాయింట్ల సూపర్‌ రికవరీ

ఇవాళ మార్కెట్‌ డే ట్రేడర్స్‌కు కొన్ని గంటల్లోనే కనకవర్షం కురిపించింది. కేవలం రెండు గంట్లలో ఆల్గో లెవల్స్‌లో కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలను తాకింది.దీంతో డే ట్రేడర్స్‌ భారీగా లాభాలు పొందారు. ఉదయం లాభాలు చూపించిన సింగపూర్ నిఫ్టి మార్కెట్‌ ప్రారంభమయ్యే సరికి డీలా పడింది. దీంతో నిఫ్టి నష్టాలతో ప్రారంభమై… కొన్ని నిమిషాల్లోనే ఇవాళ మద్దతు స్థాయి అయిన 16800 ప్ఆంతానికి చేరింది. 16,782 వద్ద నిఫ్టికి మద్దతు అందడంతో మరో గంటలోనే గ్రీన్‌లోకి వచ్చింది. రెండు గంట్లలో 17130ని దాటింది. ఈ లెక్కన నిఫ్టి 550 పాయింట్ల హెచ్చు తగ్గులను చూసింది. అయినా.. నిఫ్టిలో మెజారిటీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ నిఫ్టి ఇంకా అర శాతంపైగా నష్టంతో ఉంది. మరి మిడ్‌ సెషన్‌లో నిఫ్టి ఎలా ఉంటుందో చూడాలి.